Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఏపీ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన చంద్రబాబు.. గడ్కరీతో కీలక చర్చలు

Author
Posted By ARYADVI NEWS
| 08 Oct 2026, 06:44 PM | ANDHRA PRADESH
ఏపీ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన చంద్రబాబు.. గడ్కరీతో కీలక చర్చలు

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. గురువారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయి రాష్ట్రంలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ORR)కు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు.

అమరావతి ప్రాంత అభివృద్ధికి ORR అత్యంత కీలకమని చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టులోని మూడు ప్యాకేజీలకు ఎన్‌హెచ్‌ఏఐ సుమారు రూ.8,668 కోట్ల విలువైన టెండర్లు పిలిచింది.

పోలవరానికి ఐకానిక్‌ బ్రిడ్జి

ఇవి కూడా చదవండి

పోలవరం ప్రాజెక్టును మరింత మెరుగైన రీతిలో అనుసంధానించేలా ఖరగ్‌పూర్‌–అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను పోలవరం మీదుగా మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం సమీపంలో ఐకానిక్‌ వంతెన నిర్మాణం చేపట్టాలని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

మరోవైపు పోలవరం పనులకు నిధుల కొరత లేకుండా చూడాలని చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కోరారు. ప్రాజెక్టు పనుల పురోగతితో పాటు జల్‌ జీవన్‌ మిషన్‌–అమరజీవి జలధార పనులపైనా చర్చించారు.