- 10న వరల్డ్ మెంటల్ హెల్త్ డే
- ప్రముఖ సైకాలజిస్ట్ లక్ష్మీ తాళ్లూరి
ఖమ్మం, అక్టోబర్, 8:
మానసిక అనారోగ్యాన్ని అధిగమించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడం
కోసం కృషి చేస్తున్నట్లు ప్రముఖ సైకాలిజస్ట్, లైఫ్ స్కిల్స్ కోచ్ లక్ష్మీ తాళ్లూరి
పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ నెల 10న శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఖమ్మం లోని జెడ్పీ సమావేశం మందిరంలో వరల్డ్ మెంటల్ హెల్త్ డేను నిర్వహిస్తున్నట్లు
తెలిపారు. గురువారం ఖమ్మంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ తాళ్లూరి మాట్లాడుతూ వరల్డ్ మెంటల్ హెల్త్ డే కార్యక్రమంలో భాగంగా వంద పోస్టర్లతో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని, దీనిని మమత ఆసుపత్రికి చెందిన ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్, డాక్టర్ ఎస్.మంజుల ప్రారంభించనున్నారని తెలిపారు. ఇంకా కార్యక్రమానికి సూపరిండెంటెండ్ ఆఫ్ పోలీస్ రీజనల్ ఇంటిల్జెన్స్ ఆఫీసర్, ఖమ్మం రీజియున్ శ్రీరామోజు రమేష్, ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ సతీష్ బాబు, జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఏ.శ్రీధర్, ప్రముఖ సైకాలజిస్ట్, సన్ైషెన్ స్కూల్ ఛైర్మన్ డాక్టర్ టి.సృజన్ కుమార్, పిజి కాలేజీ ప్రిన్సిపాల్, సైకాలజీ యోగాథెరఫి డాక్టర్ టి.గోపి, సైకాలజిస్ట్ ఏ.నాగరాజు, ఎన్సిఎస్సి కో ఆర్డినేటర్, ఏపిఏఐ ఖమ్మం ప్రెసిడెంట్ ఇ.వెంకటేశ్వర్లు హాజరు కానున్నట్లు తెలిపారు. సమాజంలో ఎన్నో అమానుష, అసాంఘిక సంఘటనలు జరగడానికి కారణం మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడవేునన్నారు. విలువలతో కూడిన వ్యక్తులతో కలిసి పని చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చనన్నారు. విద్యార్థి దశ నుండే వారి మెదళ్లలో చదువుతో పాటు మానసిక పరిపక్వత పెంపొందించడం చాలా అవసరమన్నారు. ఎన్నో రకైమెన మానసిక ఒత్తిళ్లు ఉదాహరణకు స్ట్రెస్, కోపం, ఎన్నో రకాల ఫోబియాలను అధిగమించడం ఈ కార్యకమం ముఖ్య ఉద్దేశమన్నారు. దీన్ని విజయువంతం చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో కార్యక్రమ కోఆర్డినేటర్ దాసరోజు శ్రీనివాస్, డాక్టర్ పవన్, డాక్టర్ రచన, స్వాతి తదితరులు పాల్గొన్నారు.