అక్టోబర్ 13, అనంతగిరి(ఆర్యాద్వి):అనంతగిరి లో కొలువైన తెలంగాణ శబరిమల శ్రీ అయ్యప్ప సన్నిధిలో ప్రారంభమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏడో రోజు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా సుమారు 250 మంది భవానీ మాలధారణ స్వాములు, మాతలు మరియు అయ్యప్ప భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ రోజు అన్నప్రసాద వితరణకు దాతలుగా మహారాజపోశకులు బుర్రా పుల్లారెడ్డి–సుధారాణి దంపతులు, పసుమర్తి హరిప్రకాష్–ప్రత్యుష దంపతులు వ్యవహరించారు. వారి ఔదార్యంతో భక్తులకు అన్నప్రసాద వితరణ సజావుగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, పందిరి వీరయ్య, ఆనంతుల ఉపేందర్, నారపరాజు వినయ్, అయితనబోయిన వెంకటేశ్వర్లు, పాలిక నరసింహారావు, లైన్ మెన్ భాస్కర్, ఈదుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం మహాదానం అనే భావనతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణను కొనసాగిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.