ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 14:
ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం శిశు సంక్షేమ శాఖ "పిడి ప్రమీల" ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణములు ఐదవరోజు అట్ల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవముగా జరుపుకున్నారు . ఐసిడిఎస్ అధికారులు అంగనవాడి టీచర్లు భారీగా తరలి రావడం తో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది . చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ ఉయ్యాల పాటలతో , చప్పట్లు ఆటలతో , కోలాటాలతో ఆడుకోవడం జరిగింది . అనంతరం ప్రసాద వితరణ , బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి . ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు వీరభద్రమ్మ, కవిత, కమల ప్రియ, సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టరేట్ ప్రాంగణంలో బతకమ్మ సంబరాలు విజయవంతం చేశారు .