EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మిస్ యూనివర్స్ వేదికపై సుస్మితా సేన్‌తో ఊర్వశి రౌతేలా.. భావోద్వేగం

    Author ARYADVI NEWS | 24 Aug 2026, 07:42 PM | Cinema
    మిస్ యూనివర్స్ వేదికపై సుస్మితా సేన్‌తో ఊర్వశి రౌతేలా.. భావోద్వేగం

    ముంబయి: నటి, మాజీ అందాల రాణి ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు వరుసగా నాలుగోసారి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈసారి ఆమెకు ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది. తన గురువుగా భావించే మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో ఒకే వేదికను పంచుకోవడంతో ఊర్వశి భావోద్వేగానికి గురయ్యారు.తన కెరీర్‌లో సుస్మితా సేన్ కీలక పాత్ర పోషించారని ఊర్వశి తెలిపారు. తనకు సుస్మితా తొలి మెంటర్, గురువు అని పేర్కొన్నారు. తన పట్టాభిషేకం రోజున సుస్మితా స్వయంగా కిరీటం అలంకరించిన క్షణాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.
    సుస్మితా తనపై ఉంచిన నమ్మకం తనకు ఎంతో ప్రత్యేకమని ఊర్వశి పేర్కొన్నారు. దేవుడితో పాటు తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, ముఖ్యంగా సుస్మితా సేన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. కొన్ని కలలు నెరవేరితే.. మరికొన్ని ఊహకు అందనంత అద్భుతంగా ఉంటాయని, తనకు ఎదురైన ఈ అనుభవం రెండో కోవకు చెందుతుందని భావోద్వేగంగా చెప్పారు.ఇక ఈ కార్యక్రమంలో ఊర్వశి ధరించిన త్రివర్ణ పతాకం గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరుసగా నాలుగోసారి మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం తనకు ఎంతో గౌరవంగా ఉందని ఆమె చెప్పారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తాను ‘నేను ఇండియన్’ అని గర్వంగా చెప్పానని, ఇప్పుడు త్రివర్ణ గౌనులో మిస్ యూనివర్స్ ఇండియాకు జడ్జిగా వ్యవహరించడం ఆ భావనకు మరింత అర్థాన్ని ఇచ్చిందని తెలిపారు. భారతీయురాలిగా పుట్టినందుకు గర్విస్తున్నానని ఊర్వశి పేర్కొన్నారు.