Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రష్యాలో అమెరికా యుద్ధ విమానం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

Author
Posted By ARYADVI NEWS
| 25 Aug 2026, 07:01 PM | INTERNATIONAL
రష్యాలో అమెరికా యుద్ధ విమానం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతల వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన సైనిక రవాణా విమానం బోయింగ్ సీ-17 గ్లోబ్‌మాస్టర్-3 రష్యా రాజధాని మాస్కోలో ల్యాండ్ కావడం తీవ్ర చర్చకు దారితీసింది.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో అమెరికా మిలిటరీ విమానం రష్యాలో దిగడంతో.. ఇరు దేశాల మధ్య ఏదైనా కీలక దౌత్య పరిణామం జరగబోతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ విమానం లాత్వియా రాజధాని రిగాలో ఉదయం 8.50 గంటలకు బయలుదేరి.. సుమారు 10 గంటలకు మాస్కోలో దిగినట్లు సమాచారం. అయితే ఈ పరిణామంపై అమెరికా, రష్యా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తమకు విమానం రాకపై సమాచారం లేదని రష్యా పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఉన్నతాధికారుల పర్యటనకు ఏర్పాట్లా?

అమెరికా సైనిక రవాణా విమానం సాధారణంగా సైనిక సామాగ్రి, సిబ్బంది, వాహనాలు, కమ్యూనికేషన్ పరికరాలను తరలించేందుకు ఉపయోగిస్తారు. ఉన్నతస్థాయి అధికారుల పర్యటనలకు ముందుగా లాజిస్టికల్ ఏర్పాట్ల కోసం ఇలాంటి విమానాలను పంపడం కూడా జరుగుతుంది.

ఈ నేపథ్యంలో త్వరలో అమెరికా ప్రతినిధులు మాస్కోలో పర్యటించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై దౌత్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న అంచనాలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి.

అమెరికా ప్రత్యేక రాయబారులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్‌ల మాస్కో పర్యటనకు ఈ విమానం రాకతో సంబంధం ఉండొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు.