Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

కోదాడ సమీపంలో ఘోర ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. ఆరుగురు మృతి

Author
Posted By ARYADVI NEWS
| 26 Aug 2026, 07:49 AM |
కోదాడ సమీపంలో ఘోర ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. ఆరుగురు మృతి

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు
20 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తుండగా ఘటన

సూర్యాపేట: జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం దొరకుంట శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్‌ నుంచి ఏలూరుకు 42 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. దొరకుంట సమీపంలోకి చేరుకున్న సమయంలో రోడ్డుపై నిలిపి ఉన్న కంటైనర్‌ను బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా జరిగిన ఘటనతో భయాందోళనకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి క్షతగాత్రులను అంబులెన్సుల్లో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.