Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

DRDOలో JRF, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. సెప్టెంబర్ 24 చివరి తేదీ

Author
Posted By ARYADVI NEWS
| 26 Aug 2026, 06:56 PM | ఉద్యోగావకాశాలు
DRDOలో JRF, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. సెప్టెంబర్ 24 చివరి తేదీ

మొత్తం 5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
JRF పోస్టులు – 4, రీసెర్చ్ అసోసియేట్ – 1
JRFకు MSc/ M.Techతో పాటు NET/GATE అర్హత
గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీస్ (DIBT)లో రీసెర్చ్ అసోసియేట్ (RA), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి.

JRF అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఫస్ట్ క్లాస్‌లో MSc పూర్తి చేసి ఉండాలి. అలాగే NET/GATE స్కోర్ ఉండాలి. లేదా ఫస్ట్ క్లాస్‌లో M.Tech ఉత్తీర్ణులై ఉండాలి.

ఇవి కూడా చదవండి

రీసెర్చ్ అసోసియేట్: ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్, ఫుడ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ లేదా సంబంధిత విభాగంలో PhD పూర్తి చేసి ఉండాలి. AI, మెషిన్ లెర్నింగ్ లేదా సిమ్యులేషన్ టూల్స్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: గరిష్టంగా 35 ఏళ్లు. OBCలకు 3 ఏళ్లు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ సెప్టెంబర్ 24.

అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం DRDO అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.