Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

‘SIR’ పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు.. హైకోర్టులో వైసీపీ పిటిషన్

Author
Posted By ARYADVI NEWS
| 27 Aug 2026, 08:25 AM | ANDHRA PRADESH
‘SIR’ పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు.. హైకోర్టులో వైసీపీ పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరింది.

వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. SIR పూర్తికాకముందే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు.

పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే కొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు నష్టం కలిగే అవకాశం ఉందని వైసీపీ వాదించింది. ప్రస్తుతం జరుగుతున్న సవరణలో మృతులు, నకిలీ ఓటర్లు, వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడంతో పాటు 18 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఓటు హక్కు కల్పిస్తున్నారని తెలిపింది.

ఇవి కూడా చదవండి

కొత్త జాబితా సిద్ధమైన తర్వాతే ఎన్నికలకు వెళితే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అందుతుందని పిటిషన్‌లో పేర్కొంది. రిజర్వేషన్లపై కూడా పాత జాబితా ప్రభావం చూపే అవకాశం ఉందని వైసీపీ అభిప్రాయపడింది.