Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఘనంగా ది చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభం

Author
Posted By ARYADVI NEWS
| 03 Oct 2026, 06:47 PM | TELANGANA
ఘనంగా ది చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభం

ప్రారంభించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

చెన్నయ్ షాపింగ్ మాల్ లో సినీనటి రితికా నాయక్ సందడి

ఘనంగా ది చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభం - Additional Image

కోదాడ టౌన్,అక్టోబర్ 03 (ఆర్యాద్వి): కోదాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నయ్ షాపింగ్ మాల్‌ ను స్థానిక శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి శనివారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ కోదాడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజలకు అత్యాధునిక మోడల్స్, నాణ్యమైన వస్త్రాలు ఒకే చోట లభించేలా ది చెన్నై షాపింగ్ మాల్ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలకు ప్రముఖ సినీనటి రితిక నాయక్ ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు. మాల్‌లోని పలు విభాగాలను సందర్శించిన రితిక , నూతన వస్త్ర శ్రేణిని, డిజైన్‌లను ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం వేదికపై పాటలకు సరదాగా స్టెప్పులు వేసి అక్కడున్న యువతలో ఎనలేని జోష్ నింపారు. సినీనటిని చూడటానికి, సెల్ఫీలు దిగడానికి అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాల్ యాజమాన్యం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి, నటి రితిక నాయక్ ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నెని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, కమిషనర్ రమాదేవి, స్థానిక కౌన్సిలర్ కోల్లా కోటిరెడ్డి, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, షాపింగ్ మాల్ నిర్వాహకులు మర్రి వెంకటరెడ్డి పట్టణ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి