Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత..

Author
Posted By ARYADVI NEWS
| 27 Aug 2026, 08:37 AM | తాజా సమాచారం
ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత..

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. ఆయన మృతిచెందిన విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) సంతాపం తెలిపింది.

1976లో కె. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’ సినిమాతో నారాయణరావు వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అనంతరం 100కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘హిట్లర్‌’ తదితర చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్లినీకే శుభం నాకు’ వంటి చిత్రాలను నిర్మించారు.

ఇవి కూడా చదవండి

కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు గుంతకల్లులో బాల్యం, విద్యాభ్యాసం పూర్తి చేశారు. భరతనాట్యం, కూచిపూడి, నటనలో శిక్షణ పొందారు. సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటించారు. ఆయనకు రజనీకాంత్‌, చిరంజీవితో సన్నిహిత స్నేహం ఉండేది.