Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

లండన్ వరకు లుక్కా హిమజ ప్రతిభ.. బ్రిటన్ మహారాణి నిర్వహించే రచనా పోటీకి న్యాయనిర్ణేతగా అరుదైన గుర్తింపు

Author
Posted By ARYADVI NEWS
| 29 Aug 2026, 06:41 AM | TELANGANA
లండన్ వరకు లుక్కా హిమజ ప్రతిభ.. బ్రిటన్ మహారాణి నిర్వహించే రచనా పోటీకి న్యాయనిర్ణేతగా అరుదైన గుర్తింపు

అంతర్జాతీయ రచనా పోటీలో జడ్జిగా తెలంగాణ యువ న్యాయవాది లుక్కా హిమజ... రాయల్ కామన్వెల్త్ సొసైటీ నుంచి ‘వాల్యూడ్ జడ్జ్’ సర్టిఫికెట్.

తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా నమోదై, ప్రస్తుతం హైకోర్టు ప్రముఖ మహిళా న్యాయమూర్తి ఆధ్వర్యంలో లీగల్ రీసెర్చర్‌గా సేవలందిస్తున్న లుక్కా హిమజ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అంతర్జాతీయ రచనా పోటీలలో ఒకటైన ది క్వీన్స్ కామన్వెల్త్ రైటింగ్ కాంపిటీషన్ 2026 కి న్యాయనిర్ణేతగా వ్యవహరించినందుకు రాయల్ కామన్వెల్త్ సొసైటీ ఆమెకు ‘వాల్యూడ్ జడ్జ్’ సర్టిఫికెట్ అందజేసింది.

లండన్ వరకు లుక్కా హిమజ ప్రతిభ.. బ్రిటన్ మహారాణి నిర్వహించే రచనా పోటీకి న్యాయనిర్ణేతగా అరుదైన గుర్తింపు - Additional Image

1883లో ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ రచనా పోటీకి ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు ఉంది. పోటీ విజేతల కోసం నిర్వహించే విన్నర్స్ వీక్ కార్యక్రమం లండన్‌లోని రాజభవనంలో క్వీన్ ఆతిథ్యమిచ్చే ప్రత్యేక అవార్డు వేడుకతో ముగుస్తుంది. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి పోటీలో న్యాయనిర్ణేతల బృందంలో చోటు దక్కించుకోవడం హిమజకు అరుదైన గౌరవంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

విద్యారంగంలో కూడా హిమజ చిన్నప్పటి నుంచే విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో 10/10 జీపీఏ, ఇంటర్మీడియట్‌లో కళాశాల ప్రథమ స్థానం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ.ఎల్‌.ఎల్‌.బి. ఐదేళ్ల కోర్సులో క్యాంపస్ ప్రథమ స్థానం, తెలంగాణ పీజీ లాసెట్‌లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించారు. అనంతరం ప్రతిష్ఠాత్మక నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా లో పబ్లిక్ లా అండ్ లీగల్ థియరీలో ఎల్‌.ఎల్‌.ఎం. పూర్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో లీగల్ రీసెర్చర్‌గా సేవలందిస్తున్న హిమజ, భవిష్యత్తులో న్యాయమూర్తిగా సేవలందించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె తల్లిదండ్రులు లుక్కా చంద్రశేఖరరావు, లుక్కా శ్రీరేఖ ఇద్దరూ న్యాయవాదులు కాగా, సోదరి డాక్టర్ దివిజ జనరల్ మెడిసిన్‌లో ఎం.డి. అభ్యసిస్తున్నారు.

బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీలో హిమజకు లభించిన ఈ గుర్తింపు తెలంగాణకు, న్యాయవాద సమాజానికి గర్వకారణంగా, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.