Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రాఖీ పండుగ రోజే విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Author
Posted By ARYADVI NEWS
| 29 Aug 2026, 08:33 AM | ANDHRA PRADESH
రాఖీ పండుగ రోజే విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

విశాఖపట్నం: రాఖీ పండుగ రోజే విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
మల్లా వినోద్‌కుమార్‌ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో వినోద్‌కుమార్‌ ఉరికి వేలాడుతూ కనిపించగా, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు మృతిచెంది ఉన్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వినోద్‌కుమార్‌ ముందుగా భార్య, పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సంతోషంగా గడిపిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.