Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

మైదానంలోనే కాదు.. మార్కెట్‌లోనూ మన క్రికెటర్ల హవా!

Author
Posted By ARYADVI NEWS
| 29 Aug 2026, 06:23 PM | Sports
మైదానంలోనే కాదు.. మార్కెట్‌లోనూ మన క్రికెటర్ల హవా!

ఫోర్బ్స్‌ ఇండియా 2026 జాబితాలో టాప్‌-5లో ఐదుగురు భారత క్రికెటర్లు

భారత క్రికెటర్లకు మైదానంలోనే కాదు.. బ్రాండ్‌ మార్కెట్‌లోనూ తిరుగులేని క్రేజ్‌ ఉందని ఫోర్బ్స్‌ ఇండియా షోస్టాపర్స్‌ 2026 నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రముఖ సినీ, సంగీత, క్రీడా ప్రముఖులతో రూపొందించిన అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో భారత క్రికెటర్లు సత్తా చాటారు.

అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏకంగా రూ.3,542 కోట్ల బ్రాండ్‌ విలువతో జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రాలను వెనక్కి నెట్టి కోహ్లీ నంబర్‌ వన్‌గా నిలిచాడు. టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినా అతడి బ్రాండ్‌ విలువ ఏమాత్రం తగ్గలేదు.

రెండో స్థానంలో ధోనీ

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రూ.2,141 కోట్ల బ్రాండ్‌ విలువతో భారత క్రికెటర్లలో రెండో స్థానంలో నిలిచాడు. మొత్తం సెలబ్రిటీల జాబితాలో నాలుగో స్థానం సాధించాడు. క్రికెట్‌కు దూరమైనప్పటికీ అతడి అభిమానగణం, వ్యాపార కార్యకలాపాలు, ప్రకటనల ఒప్పందాలు బ్రాండ్‌ విలువను కొనసాగిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

సచిన్‌ కూడా టాప్‌లోనే

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ రూ.1,676 కోట్ల బ్రాండ్‌ విలువతో భారత క్రికెటర్లలో మూడో స్థానంలో నిలిచాడు. మొత్తం సెలబ్రిటీల జాబితాలో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌ అయి ఎన్నో ఏళ్లు గడిచినా సచిన్‌ బ్రాండ్‌ ప్రభావం కొనసాగుతూనే ఉంది.

బుమ్రా, రోహిత్‌ కూడా..

స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా రూ.1,142 కోట్ల బ్రాండ్‌ విలువతో క్రికెటర్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. మొత్తం సెలబ్రిటీల జాబితాలో 16వ స్థానం సాధించాడు.

మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రూ.1,055 కోట్ల బ్రాండ్‌ విలువతో భారత క్రికెటర్లలో ఐదో స్థానంలో ఉన్నాడు. మొత్తం సెలబ్రిటీల జాబితాలో 18వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఐదుగురి బ్రాండ్‌ విలువ రూ.9,556 కోట్లు

ఫోర్బ్స్‌ ఇండియా 2026 జాబితాలో టాప్‌-5లో చోటు దక్కించుకున్న ఈ ఐదుగురు భారత క్రికెటర్ల మొత్తం బ్రాండ్‌ విలువ రూ.9,556 కోట్లు. ఆటతో పాటు సోషల్‌ మీడియా ప్రభావం, అభిమానుల ఆదరణ, వాణిజ్య ఒప్పందాలు భారత క్రికెటర్లను భారీ బ్రాండ్లుగా నిలబెడుతున్నాయి.