Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

14 కి.మీకి రూ.4 వేలు.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో కంటెంట్‌ క్రియేటర్‌కు షాక్!

Author
Posted By ARYADVI NEWS
| 29 Aug 2026, 07:20 PM | BUSINESS
14 కి.మీకి రూ.4 వేలు.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో కంటెంట్‌ క్రియేటర్‌కు షాక్!

బెంగళూరు: మూడేళ్ల విదేశీ ప్రయాణం తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన యూకేకు చెందిన కంటెంట్‌ క్రియేటర్‌ అభీష్ణ ఎన్‌కు బెంగళూరు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. నగరానికి కొత్త కావడంతో స్థానిక రవాణా విధానాలపై అవగాహన లేకపోవడాన్ని ఓ ట్యాక్సీ డ్రైవర్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నాడని ఆమె ఆరోపించారు.

ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌ ఎక్కే ముందు ఛార్జీ ఎంత అని డ్రైవర్‌ను అడగగా.. మీటర్‌ ప్రకారమే డబ్బులు తీసుకుంటానని చెప్పడంతో ఆమె నమ్మి ట్యాక్సీ ఎక్కారు. అయితే కేవలం 14 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.4,000 వసూలు చేసినట్లు తెలిపారు.

మొదట ఎయిర్‌పోర్టు ట్యాక్సీలకు ఇంతే ఛార్జీ ఉంటుందని భావించి డబ్బులు చెల్లించిన ఆమె.. తర్వాత రసీదును పరిశీలించగా అది నకిలీదని గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో తాను మోసపోయిన విషయం అర్థమైందని ఆమె లింక్డ్‌ఇన్‌లో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

డబ్బు పోయినందుకు కంటే తనకు తెలియని పరిస్థితిని ఆసరాగా చేసుకుని మోసం చేయడమే ఎక్కువ బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రాంతాలకు వెళ్లేవారు అక్కడి రవాణా ఛార్జీలు, అధికారిక క్యాబ్‌ సర్వీసుల గురించి ముందుగానే తెలుసుకోవాలని సూచించారు.

ఈ ఘటనపై ఆమె పనిచేస్తున్న సంస్థ ఫౌండర్‌ కూడా స్పందిస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టు ట్యాక్సీల్లో అధిక ఛార్జీల సమస్య చాలాకాలంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఎయిర్‌పోర్టు ట్యాక్సీ సేవలపై మరోసారి చర్చ మొదలైంది.

ప్రయాణికులు వీలైనంత వరకు అధికారిక ప్రీపెయిడ్‌ ట్యాక్సీ కౌంటర్లు లేదా నమ్మకమైన యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.