Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత రవిచంద్ర..

Author
Posted By ARYADVI NEWS
| 30 Aug 2026, 06:02 PM | TELANGANA
తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత రవిచంద్ర..

మహమ్మద్ తాజుద్దీన్ ‌కుటుంబ సభ్యులకు ధైర్యం.. వారి పిల్లలకు అండగా ఉంటామని ఎంపీ రవిచంద్ర భరోసా..

ఖమ్మం ప్రతినిధి: ఆగస్టు, 30:

ఖమ్మం: ఇటీవల మృతి చెందిన బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తాజుద్దీన్ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా తాజుద్దీన్ పార్టీ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిన చురుకైన నాయకుడు అని, ఖమ్మం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారని రవిచంద్ర గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి, మైనార్టీ సామాజిక వర్గానికి తీరని లోటని పేర్కొన్నారు.

తాజుద్దీన్ కుటుంబ పరిస్థితిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, పార్టీ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందేలా తన వంతు కృషి చేస్తానని రవిచంద్ర భరోసా ఇచ్చారు.

వారి కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని సూచిస్తూ, వారు ఏమాత్రం మనోధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, మాజీ కార్పొరేటర్ మక్బుల్, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి , సద్దాం, ఫిరోజ్, మహమ్మద్ రఫీ, షారుక్ అర్ఫత్, మునఫ్, బురహాన్, ఆసిఫ్, హిజార్ తదితరులు పాల్గొన్నారు.