Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

లారక్‌ ద్వీపంపై అమెరికా దాడి.. ఇరాన్‌ భగ్గుమంటోంది!

Author
Posted By ARYADVI NEWS
| 31 Aug 2026, 07:23 AM | INTERNATIONAL
లారక్‌ ద్వీపంపై అమెరికా దాడి.. ఇరాన్‌ భగ్గుమంటోంది!

హర్మూజ్‌ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రతీకారం తప్పదన్న ఐఆర్‌జీసీ

టెహ్రాన్‌: అమెరికా–ఇరాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక లారక్‌ ద్వీపంపై అమెరికా సైనిక దళాలు డ్రోన్‌ దాడులు నిర్వహించాయి. హర్మూజ్‌ జలసంధిలో సముద్రపు మైన్లను అమర్చేందుకు ఇరాన్‌ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది.

ఈ దాడిలో రెండు ఇరానియన్‌ లాంచర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ దళాలు మైన్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించామని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలను కాపాడేందుకు చర్యలు కొనసాగుతాయని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు అమెరికా దాడిని ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. ఇది అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్త చర్యగా ఐఆర్‌జీసీ ఆరోపించింది. దాడిలో సైనిక సిబ్బందితో పాటు పౌరులు కూడా మృతి చెందినట్లు పేర్కొంది. దాడికి పాల్పడిన వారికి తగిన మూల్యం చెల్లిస్తామని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది.

ఇటీవల హర్మూజ్‌ జలసంధిలోని అంతర్జాతీయ నౌకాయాన మార్గాల నుంచి అమెరికా సముద్రపు మైన్లను తొలగించింది. ఆపరేషన్‌ పూర్తయిన కొద్ది రోజులకే తాజా దాడి జరగడం గమనార్హం. దీంతో హర్మూజ్‌ జలసంధిలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

సముద్రపు మైన్ల విషయంలో ఎలాంటి ప్రయత్నాలను సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో హెచ్చరించిన నేపథ్యంలో తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య ఘర్షణ మరింత ముదిరే అవకాశాలను పెంచుతున్నాయి.