Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ.. యుద్ధం తర్వాత తొలిసారి ముఖాముఖి చర్చలు

Author
Posted By ARYADVI NEWS
| 31 Aug 2026, 06:31 PM | INTERNATIONAL
ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ.. యుద్ధం తర్వాత తొలిసారి ముఖాముఖి చర్చలు

పశ్చిమాసియా పరిణామాలపై చర్చకు ప్రాధాన్యం.. హర్మూజ్‌ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం

బిష్కెక్‌: కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరాన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, పెజెష్కియాన్‌ నేరుగా భేటీ కావడం ఇదే తొలిసారి.

సమావేశంలో చర్చించిన అంశాలపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. అయితే హర్మూజ్‌ జలసంధి విషయంలో నెలకొన్న పరిణామాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రాంతీయ స్థిరత్వం, వాణిజ్య మార్గాలు, భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

యుద్ధంపై పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు

బిష్కెక్‌ పర్యటనకు బయలుదేరే ముందు ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే ఇరాన్‌పై దాడులు జరిగితే వాటికి బలమైన, దృఢమైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ప్రాంతంలో అస్థిరత కొనసాగడం ఏ దేశానికీ ప్రయోజనం కాదని పేర్కొన్న ఆయన.. ఆర్థిక, భద్రతా ప్రయోజనాల కోసం దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు.

అర్మేనియా ప్రధాని పషిన్యాన్‌తోనూ భేటీ

మోదీ అర్మేనియా ప్రధాని నికోల్‌ పషిన్యాన్‌తో కూడా సమావేశమయ్యారు. రక్షణ, ఆర్థికం, ఔషధాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, విద్య, సంస్కృతి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

పశ్చిమాసియాలో పరిస్థితులతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అర్మేనియాతో భారత్‌ సంబంధాలను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు.

పుతిన్‌తోనూ భేటీ

కిర్గిజిస్థాన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశం కానున్నారు. కిర్గిజిస్థాన్‌ అధ్యక్షుడు సదిర్‌ జపరోవ్‌ ఆహ్వానం మేరకు ఆరో ప్రపంచ నోమాడ్‌ గేమ్స్‌ ప్రారంభోత్సవంలోనూ మోదీ పాల్గొననున్నారు.