Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

బెల్జియం చేతిలో భారత్‌కు షాక్‌.. హాకీ వరల్డ్‌కప్‌లో 8వ స్థానంతో సరి!

Author
Posted By ARYADVI NEWS
| 31 Aug 2026, 06:58 PM | Sports
బెల్జియం చేతిలో భారత్‌కు షాక్‌.. హాకీ వరల్డ్‌కప్‌లో 8వ స్థానంతో సరి!

షూటౌట్‌లో 4–3 తేడాతో ఓటమి.. చివరి క్షణంలో హర్మన్‌ప్రీత్ గోల్‌తో ఉత్కంఠ

వావ్రే (బెల్జియం): హాకీ వరల్డ్‌కప్‌ 2026లో భారత జట్టు ఎనిమిదో స్థానంతో టోర్నీని ముగించింది. శుక్రవారం వావ్రేలోని బెల్ఫియస్‌ హాకీ అరెనాలో జరిగిన పోరులో ఆతిథ్య బెల్జియం షూటౌట్‌లో 4–3 తేడాతో భారత్‌ను ఓడించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 3–3తో సమంగా నిలవడంతో విజేతను షూటౌట్‌ ద్వారా నిర్ణయించారు.

మ్యాచ్‌ ప్రారంభంలోనే అభిషేక్‌ గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. మన్‌ప్రీత్‌ సింగ్‌ అందించిన పాస్‌ను అందుకున్న అభిషేక్‌ బలమైన షాట్‌తో బెల్జియం గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి గోల్‌ సాధించాడు. అయితే రెండో క్వార్టర్‌లో బెల్జియం పుంజుకుంది. రొమాన్‌ డువెక్సాట్‌ 22వ నిమిషంలో, హ్యూగో లాబోచరే 23వ నిమిషంలో గోల్స్‌ చేసి ఆతిథ్య జట్టును 2–1 ఆధిక్యంలోకి తీసుకెళ్లారు.

హర్మన్‌ప్రీత్‌ మెరుపు డ్రాగ్‌ఫ్లిక్‌

ద్వితీయార్ధం ఆరంభంలో భారత్‌ ఎదురుదాడికి దిగింది. లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అద్భుతమైన డ్రాగ్‌ఫ్లిక్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం బెల్జియం తరఫున నికోలస్‌ డి కెర్పెల్‌ గోల్‌ చేయడంతో ఆ జట్టు మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది.

ఇవి కూడా చదవండి

మ్యాచ్‌ ముగియడానికి కేవలం 26 సెకన్ల ముందు భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. మరోసారి హర్మన్‌ప్రీత్‌ తన డ్రాగ్‌ఫ్లిక్‌తో గోల్‌ కొట్టి స్కోరును 3–3తో సమం చేశాడు. దీంతో మ్యాచ్‌ షూటౌట్‌కు వెళ్లింది.

షూటౌట్‌లో భారత్‌కు నిరాశ

షూటౌట్‌లో బెల్జియం ఆటగాళ్లు టామ్‌ బూన్‌, ఆర్థర్‌ డి స్లూవర్‌, అలెజాండ్రిక్‌ హెండ్రిక్స్‌, రొమాన్‌ డువెక్సాట్‌ గోల్స్‌ సాధించారు. భారత్‌ 3 గోల్స్‌ మాత్రమే చేయడంతో 4–3 తేడాతో బెల్జియం విజయం సాధించింది.

ఈ ఓటమితో భారత్‌ హాకీ వరల్డ్‌కప్‌లో 8వ స్థానంతో టోర్నీని ముగించింది. ఆతిథ్య బెల్జియం ఏడో స్థానాన్ని దక్కించుకుంది.

టాప్‌ స్కోరర్‌గా హర్మన్‌ప్రీత్‌

టోర్నీ మొత్తంలో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం 8 గోల్స్‌ సాధించిన అతడు అర్జెంటీనా ఆటగాడు డోమెనెతో కలిసి టాప్‌ స్కోరర్ల జాబితాలో నిలిచాడు.