Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

వైసీపీలో ముదురుతున్న వర్గపోరు.. శ్రీకాకుళంలో సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు?

Author
Posted By ARYADVI NEWS
| 31 Aug 2026, 07:49 PM | ANDHRA PRADESH
వైసీపీలో ముదురుతున్న వర్గపోరు.. శ్రీకాకుళంలో సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు?

శ్రీకాకుళం: వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీ అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో నేతలంతా ఐక్యంగా పనిచేయాలని అధినేత వైఎస్ జగన్ సూచిస్తున్నప్పటికీ.. కొన్ని జిల్లాల్లో సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తాజాగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. జిల్లాపై పక్క జిల్లాల నేతల పెత్తనం అవసరం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తున్నాయి.

‘‘ఎవరి తల వాళ్లు దువ్వుకుంటే పాపిట సరిగ్గా ఉంటుంది.. పక్కవాళ్లు దువ్వితే వంకరగా ఉంటుంది’’ అంటూ రామ్ మనోహర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2004లో తన తండ్రి ధర్మాన ప్రసాదరావు జిల్లాలో కాంగ్రెస్ విజయానికి కీలకంగా పనిచేశారని, అప్పట్లో బయట జిల్లాల నేతల సహకారం అవసరం లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ వ్యాఖ్యలు విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించే చేసినవేనన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలినా బొత్స రాజకీయంగా క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో పాటు శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా కీలక బాధ్యతలు చేపట్టారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం లోక్‌సభ పరిధిలో ఉండటం, పాలకొండ మన్యం జిల్లాలోకి వెళ్లడంతో ఈ ప్రాంతాల్లో బొత్స కుటుంబ ప్రభావం ఉందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో ఉంది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు బొత్సతో పాటు ఆయన మేనల్లుడు చిన్న శ్రీనుతో రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రామ్ మనోహర్ వ్యాఖ్యల వెనుక ధర్మాన ప్రసాదరావు అభిప్రాయం కూడా ఉండొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల తర్వాత ధర్మానకు పార్టీలో గతంలో ఉన్నంత ప్రాధాన్యం తగ్గిందన్న ప్రచారం ఉంది. శ్రీకాకుళం జిల్లా పార్టీ బాధ్యతల విషయంలోనూ అధిష్ఠానం మార్పులపై ఆలోచన చేస్తోందన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు బొత్సకు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యం, శాసనమండలిలో కీలక స్థానం నేపథ్యంలో శ్రీకాకుళం రాజకీయాల్లో ఆయన ప్రభావం పెరుగుతోందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోకి ఇతర ప్రాంతాల నేతల జోక్యాన్ని వ్యతిరేకిస్తూ రామ్ మనోహర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయన్నది వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం. అయితే ఈ విభేదాలు భవిష్యత్తులో ఏ స్థాయికి చేరతాయన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.