Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

హరీశ్‌రావును క్షమించినా.. ప్రశాంత్‌రెడ్డిని మాత్రం క్షమించను: కవిత

Author
Posted By ARYADVI NEWS
| 01 Sep 2026, 08:42 AM | TELANGANA
హరీశ్‌రావును క్షమించినా.. ప్రశాంత్‌రెడ్డిని మాత్రం క్షమించను: కవిత

నిజామాబాద్: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి వ్యవహారాల కారణంగానే రెండు పార్టీలు ఒక అవగాహనతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మౌనం వహిస్తోందని అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె మాట్లాడారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని కవిత విమర్శించారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికీ సాగునీరు అందలేదని అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలనలో కొద్దిమంది కుటుంబాలకే ప్రయోజనం చేకూరిందని విమర్శించారు.

సభలో తన కుటుంబానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించిన కవిత భావోద్వేగానికి గురయ్యారు. ప్రశాంత్‌రెడ్డి తనను తండ్రికి దూరం చేశారని ఆరోపించారు. హరీశ్‌రావు, సంతోష్‌రావులను క్షమించగలనేమో కానీ ప్రశాంత్‌రెడ్డిని మాత్రం జీవితంలో క్షమించబోనని అన్నారు. కష్టాల్లో ఉన్న ఆడబిడ్డకు పుట్టింటి నుంచి అండగా నిలవాల్సింది పోయి తనపై కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈడీ, సీబీఐ కేసుల పేరుతో నాలుగేళ్ల పాటు వేధింపులకు గురయ్యానని కవిత తెలిపారు. తన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ తాను నిర్దోషినని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే పార్టీ పెట్టానని, పదవుల కోసం కాదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కవిత విమర్శించారు. ప్రభుత్వం వైఫల్యాలపై పోరాడాల్సిన బీఆర్ఎస్ ప్రతిపక్షంగా నిద్రపోతోందని ఆరోపించారు.