Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

Author
Posted By ARYADVI NEWS
| 01 Sep 2026, 08:47 AM | NATIONAL
అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

ఆరోగ్యం క్షీణించడంతో ముంబయికి తరలింపు
వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో పాటు డీహైడ్రేషన్‌ సమస్య
కిడ్నీల పనితీరుపైనా కొనసాగుతున్న పరీక్షలు
వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న 87 ఏళ్ల హజారే
పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చికిత్స

ముంబయి: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (87) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబయిలోని బాంబే ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం డాక్టర్‌ గౌతమ్‌ భన్సాలీ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది.

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, డీహైడ్రేషన్‌ కారణంగా హజారే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తొలుత రాలేగావ్‌ సిద్ధి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనను పరిస్థితి మెరుగుపడకపోవడంతో ముంబయికి తరలించారు. కిడ్నీల పనితీరుతో పాటు ఇతర ఆరోగ్య అంశాలను వైద్యులు పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హజారేకు ప్రస్తుతం పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలను బట్టి తదుపరి చికిత్సను నిర్ణయించనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలను వైద్యులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హజారే.. రాలేగావ్‌ సిద్ధి అభివృద్ధితో పాటు జల సంరక్షణ, గ్రామీణ స్వావలంబన వంటి కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు.