Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

చెవిరెడ్డికి ఊరట.. అమెరికాకు అనుమతి

Author
Posted By ARYADVI NEWS
| 01 Sep 2026, 08:52 AM | ANDHRA PRADESH
చెవిరెడ్డికి ఊరట.. అమెరికాకు అనుమతి

వైద్యం కోసం సెప్టెంబర్‌ 3–13 వరకు అమెరికా పర్యటన
షరతులతో అనుమతించిన విజయవాడ ఏసీబీ కోర్టు
తిరిగొచ్చిన వెంటనే పాస్‌పోర్టు అప్పగించాలని ఆదేశం

విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్‌ 3 నుంచి 13 వరకు ఆయన అమెరికాలో ఉండనున్నారు. పర్యటనకు సంబంధించిన చిరునామా, ఫోన్‌, ఈ-మెయిల్‌ వివరాలను కోర్టుకు సమర్పించాలని, తిరిగి వచ్చిన వెంటనే పాస్‌పోర్టును అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది.