సాధారణం కంటే తగ్గనున్న వర్షపాతం
ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
నీటిని పొదుపుగా వాడాలని ఐఎండీ సూచన
న్యూఢిల్లీ: సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా వర్షాలు సాధారణం కంటే తక్కువగా, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. బలమైన ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. వర్షాభావంతో వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించింది.