Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

Author
Posted By ARYADVI NEWS
| 01 Sep 2026, 06:20 PM | TELANGANA
రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై అప్పీల్‌
కమిషనర్‌గా కొనసాగేందుకు గ్రీన్‌సిగ్నల్‌
తదుపరి విచారణ నవంబర్‌ 3న

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను కమిషనర్‌ పదవి నుంచి తొలగించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది.

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా లోతుకుంటలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిలో అధికారులు చేపట్టిన కూల్చివేతలపై శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సింగిల్‌ జడ్జి.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే అధికారులు బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగడం సరికాదని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండగా.. రంగనాథ్‌పై ఏడాదిన్నరలో 63 కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ ఆయనను పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

ఈ ఉత్తర్వులను రంగనాథ్‌ డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేశారు. తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఆదేశాలను రద్దు చేసింది. కేసు తదుపరి విచారణను నవంబర్‌ 3కు వాయిదా వేసింది.