Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై ఊరట

Author
Posted By ARYADVI NEWS
| 01 Sep 2026, 06:31 PM | TELANGANA
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై ఊరట

స్టే ఎత్తివేసిన హైకోర్టు
ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
పథకాల అమలుకు తొలగిన అడ్డంకులు

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పథకాల అమలుపై సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర స్టేను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది.

2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సింగిల్ జడ్జి పథకాల అమలుపై స్టే విధించారు.

ఇవి కూడా చదవండి

దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ పథకాలు 2014 నుంచి అమలవుతున్నాయని, పిటిషనర్ లబ్ధిదారుడు కాదని తెలిపారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ఇలాంటి వ్యాజ్యాలను డివిజన్ బెంచ్ మాత్రమే విచారించాలని వాదించారు.

వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు అడ్డంకులు తొలగిపోయాయి.