Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఆఫ్ఘాన్‌ సిరీస్‌కు టీమిండియా ప్రకటన

Author
Posted By ARYADVI NEWS
| 01 Sep 2026, 06:38 PM | Sports
ఆఫ్ఘాన్‌ సిరీస్‌కు టీమిండియా ప్రకటన

శ్రేయాస్‌కు కెప్టెన్సీ
హార్దిక్‌కు చోటు దక్కలేదు
వైభవ్ సూర్యవంశీకి అవకాశం

ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగించగా.. హైదరాబాద్‌ క్రికెటర్‌ తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కలేదని సమాచారం. 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి తొలిసారి అవకాశం లభించింది.

ఇవి కూడా చదవండి

గత సిరీస్‌ల్లో పెద్దగా ఆకట్టుకోని సంజు శాంసన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇషాన్ కిషన్ కూడా జట్టులో ఉన్నాడు. శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తదితరులు జట్టులో చోటు దక్కించుకున్నారు.

భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య టీ20 సిరీస్‌ సెప్టెంబర్‌ 13 నుంచి ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి.