Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

హైదరాబాద్‌లో గ్లోబల్‌ యూనివర్సిటీలు

Author
Posted By ARYADVI NEWS
| 01 Sep 2026, 06:50 PM | TELANGANA
హైదరాబాద్‌లో గ్లోబల్‌ యూనివర్సిటీలు

లండన్, నార్త్‌ఈస్టర్న్‌ వర్సిటీల క్యాంపస్‌లు
భారత్‌లో తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు
హార్వర్డ్‌ కోర్సులపై ఆసక్తి

హైదరాబాద్‌ను గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, అమెరికాలోని నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ తమ ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

భారత్‌లో ఈ రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు క్యాంపస్‌లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధుల విదేశీ పర్యటనల్లో జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ కూడా తెలంగాణలో ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లు, వివిధ కోర్సులు అందించేందుకు ఆసక్తి చూపినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, ఎల్‌ఎస్‌ఈ, ఎంఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలతోనూ చర్చలు జరిగినట్లు తెలిపింది.

అంతర్జాతీయ స్థాయి విద్య హైదరాబాద్‌లోనే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. నైపుణ్యాభివృద్ధి, విద్యపై ప్రత్యేక దృష్టితో హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.