Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రేవంత్‌పై ముందు చర్యలు తీసుకోండి: కొండా సురేఖ

Author
Posted By ARYADVI NEWS
| 02 Sep 2026, 06:10 PM | TELANGANA
రేవంత్‌పై ముందు చర్యలు తీసుకోండి: కొండా సురేఖ

తనను రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరలేదన్న మంత్రి

హైదరాబాద్: తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేసి చర్యలు తీసుకోవడం సరికాదని సురేఖ అన్నారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని రాహుల్ గాంధీ చెబుతుంటారని గుర్తుచేశారు. తన కుమార్తెను తీవ్రంగా రెచ్చగొట్టడం వల్లే ఆమె ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పారు.
పార్టీలో బీసీ నేతలకు ఒక న్యాయం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మరో న్యాయమా అని ఆమె ప్రశ్నించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోలేదని, కేవలం బీసీలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని సురేఖ ప్రశ్నించారు. రాష్ట్ర కేబినెట్‌లోని పలువురు మంత్రులపై ఆరోపణలు ఉన్నాయని, రేవంత్ పాలనపై మంత్రులు, సీనియర్ నేతల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. తనను రాజీనామా చేయాలని ఇప్పటివరకు అధిష్ఠానం కోరలేదని, జరిగిన పరిణామాలన్నింటినీ రాతపూర్వకంగా హైకమాండ్‌కు అందజేసినట్లు తెలిపారు.