Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

‘రోమాంచకం’పై సందీప్ రెడ్డి వంగా ఫుల్ హ్యాపీ

Author
Posted By ARYADVI NEWS
| 02 Sep 2026, 06:55 PM | Cinema
‘రోమాంచకం’పై సందీప్ రెడ్డి వంగా ఫుల్ హ్యాపీ

హైదరాబాద్: సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ సినిమా సెప్టెంబర్ 3న విడుదలకు సిద్ధమైంది. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించగా.. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు.

సినిమా ఫస్ట్ కట్‌ను చూసిన సందీప్ రెడ్డి వంగా సంతృప్తి వ్యక్తం చేసినట్లు నిర్మాత తెలిపారు. ఇంజినీరింగ్ యువకుడి ప్రేమకథ, అతడి స్నేహితుల గ్యాంగ్ చుట్టూ కథ సాగుతుందని చెప్పారు. కామెడీని ప్రత్యేకంగా జోడించకుండా కథలో సహజంగా ఉండేలా రూపొందించినట్లు వివరించారు.

సినిమాలో హ్యూమర్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయని నిర్మాత పేర్కొన్నారు. సుమారు 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి