Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఈ ఏడాదే గగన్‌యాన్ తొలి ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

Author
Posted By ARYADVI NEWS
| 04 Sep 2026, 08:16 AM | NATIONAL
ఈ ఏడాదే గగన్‌యాన్ తొలి ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

భారత్‌ ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌లో కీలక ఘట్టానికి ఇస్రో సిద్ధమవుతోంది. తొలి మానవ రహిత ప్రయోగాన్ని ఈ ఏడాది చివరి నాటికి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్‌ వి. నారాయణన్‌ తెలిపారు.

తొలి ప్రయోగంలో ‘వ్యోమమిత్ర’ హాఫ్‌-హ్యూమనాయిడ్‌ రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. వ్యోమగాములు వెళ్లే సమయంలో క్యాబిన్‌లోని పరిస్థితులను ఈ రోబో అనుకరించనుంది. మానవసహిత ప్రయోగానికి ముందు మొత్తం మూడు మానవ రహిత ప్రయోగాలు నిర్వహించి భద్రతా ప్రమాణాలను పరీక్షించనున్నారు.

గగన్‌యాన్‌కు అవసరమైన కీలక సాంకేతిక పనులు దాదాపు పూర్తయ్యాయి. హెచ్‌ఎల్‌వీఎం-3 హ్యూమన్‌ రేటింగ్‌, క్రూ ఎస్కేప్‌, లైఫ్‌ సపోర్ట్‌ వ్యవస్థల అభివృద్ధి పూర్తయినట్లు ఇస్రో తెలిపింది. ఇప్పటివరకు సుమారు 8,000 పరీక్షలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మానవసహిత గగన్‌యాన్‌ ద్వారా ముగ్గురు భారతీయ వ్యోమగాములను భూమికి 400 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి పంపి, మూడు రోజుల అనంతరం సురక్షితంగా తిరిగి తీసుకురావడం లక్ష్యం. వ్యోమగాముల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని నారాయణన్‌ స్పష్టం చేశారు.