భారత్లో అవకాడో పండ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఈ పండు రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తోందని తెలిపారు.
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశంలోని పలువురు అవకాడో రైతుల విజయాలను ప్రధాని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన వరదరాజ్ గతంలో టమాటా, అరటి సాగు చేసేవారు. అవకాడో సాగుపై ఆసక్తి పెంచుకుని పంట సాగు ప్రారంభించగా ప్రస్తుతం ఏటా సుమారు నాలుగు టన్నుల దిగుబడిని సాధిస్తూ స్థానిక మార్కెట్లకు విక్రయిస్తున్నారు.
తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతంలోనూ రైతులు అవకాడో సాగుతో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. కర్ణాటకలోని చిక్కమగళూరు రైతులు కాఫీ, మిరియాల తోటల్లో అంతరపంటగా అవకాడోను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి
అవకాడోలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్-కె, విటమిన్-ఇతో పాటు ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వులు ఉంటాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరగడంతో అవకాడోకు మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతోంది.
ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో అవకాడో సాగు ఎక్కువగా జరుగుతోంది. పట్టణ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ గ్రామీణ రైతులకు కొత్త ఆదాయ అవకాశాలను కల్పిస్తోంది.


