Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రేషన్‌ సన్నబియ్యం అమ్మితే కార్డు రద్దు.. మంత్రి తుమ్మల హెచ్చరిక

Author
Posted By ARYADVI NEWS
| 04 Sep 2026, 09:41 PM | TELANGANA
రేషన్‌ సన్నబియ్యం అమ్మితే కార్డు రద్దు.. మంత్రి తుమ్మల హెచ్చరిక

ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని బయట విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. బియ్యాన్ని అమ్ముతున్నట్లు తేలితే సంబంధిత లబ్ధిదారుల రేషన్‌ కార్డులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని పూతాని తండాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేయకూడదని సూచించారు.

అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఇళ్ల మంజూరులో రాజకీయాలకు తావులేకుండా అర్హత, పేదరికమే ప్రాతిపదికగా ఉండాలని స్పష్టం చేశారు. అర్హులకు ఇళ్లు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సర్పంచులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

తక్కువ వర్షపాతం కారణంగా భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. తక్కువ నీటితో సాగు చేయగల పామాయిల్‌ పంట వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. పామాయిల్‌ సాగుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.

రఘునాథపాలెం మండలంలోని రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. ఆర్వీఎఫ్‌ఆర్‌ పట్టాలు కలిగిన వారికి బోర్లు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

మండల అభివృద్ధిపై మాట్లాడుతూ సుమారు రూ.75 కోట్లతో రహదారులు, పొలాలకు వెళ్లే మార్గాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యా రంగంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలో స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.