Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

కేరళలో ఘోర ప్రమాదం.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Author
Posted By ARYADVI NEWS
| 05 Sep 2026, 08:46 AM |
కేరళలో ఘోర ప్రమాదం.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కైపమంగలం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద జాతీయ రహదారి-66పై ఆగి ఉన్న గూడ్స్‌ లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడు రిజిస్ట్రేషన్‌కు చెందిన ఈ కారులో యువకులు గురువాయూర్‌ నుంచి కొడుంగల్లూర్‌ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

లారీని ఢీకొట్టిన సమయంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై లారీ కిందకు చొచ్చుకుపోయింది. దీంతో అందులో ఉన్నవారు తీవ్రంగా చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారును కట్టర్ల సాయంతో తొలగించి మృతదేహాలను బయటకు తీశారు.

ఇవి కూడా చదవండి

మృతుల్లో పలువురు తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం.

ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న జాతీయ రహదారిపై లారీని రోడ్డు పక్కన నిలిపి ఉంచడం, కారు వేగం తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మృతదేహాలను త్రిస్సూర్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు.