ఖమ్మంలోని
మామిళ్లగూడెం అర్బన్ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్వో డాక్టర్ రామారావు..
వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు:
ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్, 5:
ఇవి కూడా చదవండి
ఖమ్మం నగర పరిధిలోని మామిళ్లగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ రామారావు ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో భాగంగా ఆసుపత్రిలోని ల్యాబొరేటరీ (Lab), వ్యాక్సినేషన్ గది మరియు మెడిసిన్ స్టోర్ రూమ్లను స్వయంగా పరిశీలించారు. ల్యాబ్లో రోగులకు అందుతున్న డయాగ్నస్టిక్ సేవల వివరాలను, స్టోర్లో అందుబాటులో ఉన్న మందుల నిల్వల రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం పీహెచ్సీ సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు: ఎన్ సి డి.,
NCD స్క్రీనింగ్ & పోర్టల్ అప్డేట్: నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) స్క్రీనింగ్ నూరు శాతం పూర్తి చేయాలని, చికిత్స పొందుతున్న రోగుల (On-treatment cases) వివరాలను ఎప్పటికప్పుడు ఫాలో-అప్ చేస్తూ పోర్టల్లో క్రమం తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేశారు.
మీ ప్రణాం (Mee Pranaam) యాప్: సిబ్బంది అంతా విధిగా ‘మీ ప్రణాం’ అటెండెన్స్ యాప్లో ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకుని, సమయపాలన పాటించాలని ఆదేశించారు.
హెచ్ ఎం ఐ ఎస్ HMIS డేటా నమోదు: ప్రతి నెలా 5వ తేదీ లోపు హెచ్ఎంఐఎస్ (HMIS) డేటా ఎంట్రీని ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు.
వ్యాక్సినేషన్ లక్ష్యాలు: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సకాలంలో టీకాలు అందించడంతో పాటు హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
VPD వి పిడి కేసుల గుర్తింపు: క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధుల (VPD Cases) లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే సామాన్య రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యు పీహెచ్సీ వైద్యాధికారి ఎన్ కృష్ణ చైతన్య, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


