Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పల్లెల విధ్వంసం – పడకేసిన పారిశుధ్యం!

Author
Posted By ARYADVI NEWS
| 06 Sep 2026, 07:15 PM | TELANGANA
పల్లెల విధ్వంసం – పడకేసిన పారిశుధ్యం!

కాంగ్రెస్ 1000 రోజుల పాలన అంతా మోసమే.. ముఖ్యమంత్రి తీరు మారకపోతే అడుగడుగునా అడ్డుకుంటాం!

అనంతగిరి సెప్టెంబర్ 06:
అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో “పల్లెల విధ్వంసం – పడకేసిన పారిశుధ్యం” అనే అంశంపై గ్రామస్థాయిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై,
ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఏదో ఉద్ధరిస్తామని చెప్పి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారు. తన కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీ పెద్దలకు మూటలు పంపుతున్నారే తప్ప, ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదనీ కేసీఆర్ ఇచ్చిన రూ.2,000 పెన్షన్ ను రూ.4,000 చేస్తామని, రైతులకు, కౌలు రైతులకు మూడు పంటలకు రూ.15,000 ఇస్తామని, ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి నేడు ఆ మాటలను అటకెక్కించారు.కేసీఆర్ ప్రభుత్వంలో 'పల్లె ప్రగతి'తో పల్లెలు ఎంతో పరిశుభ్రంగా మారాయి. మురికి కాలువల శుభ్రత, దోమల నివారణ మందుల పిచికారీ క్రమం తప్పకుండా జరిగేది. కానీ నేడు పారిశుధ్యం పూర్తిగా పడకేసి, గ్రామాలు మురికి కూపాలుగా, రోగాల నిలయాలుగా మారాయనీ కేసీఆర్ కొత్తగా ఏర్పాటు చేసిన 12,750 గ్రామ పంచాయతీల్లో పల్లెలను శుభ్రం చేస్తున్న పారిశుధ్య సిబ్బందికి నేడు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దద్దమ్మ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందనీ,
గ్రామాల్లో ప్రజలు చనిపోతే దహన సంస్కారాలకు ఇబ్బంది పడకూడదని కేసీఆర్ ప్రతి ఊరిలో వైకుంఠ ధామాలు నిర్మిస్తే, వాటిని రేవంత్ రెడ్డి చులకన చేస్తూ మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనం అని అన్నారు.
రాష్ట్రంలో కరెంటు లేదు, నీళ్లు లేవు, సరైన వైద్య సదుపాయాలు లేవు. ఇక గురుకులాల్లో చదువుకునే పేద విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం పెట్టలేక, పురుగుల అన్నం పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనీ మండిపడ్డారు. పరిపాలన చేతకాక, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారు. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ ని పట్టుకొని ఒక సైకోలా ఆయన వాడుతున్న భాషను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. ఆడా, మగా, పెద్దలు అనే విచక్షణ లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు దుర్మార్గం."రేవంత్ రెడ్డికి ఏమాత్రం మానవత్వం ఉన్నా, నోరు అదుపులో పెట్టుకుని పరిపాలనపై దృష్టి సారించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించి, పల్లెల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. లేనిపక్షంలో, బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రతిఘటిస్తాం, అడుగడుగునా ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం" అని బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

పల్లెల విధ్వంసం – పడకేసిన పారిశుధ్యం!  - Additional Image