Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు లో విఫలం: మాజీ ఎంపీ నామ

Author
Posted By ARYADVI NEWS
| 06 Sep 2026, 07:17 PM | TELANGANA
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు లో విఫలం: మాజీ ఎంపీ నామ

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గ్రామాల్లో చర్చ జరగాలి: మాజీ ఎంపీ నామ

కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: మాజీ ఎంపీ నామ

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు లో విఫలం: మాజీ ఎంపీ నామ  - Additional Image

కేసీఆర్ పదేళ్ల పాలనలోనే పల్లెలు, పట్టణాల అభివృద్ధి: మాజీ ఎంపీ నామ

కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో పల్లెల్లో, పట్టణాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది: మాజీ ఎంపీ నామ

ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్ 06:

ఇవి కూడా చదవండి

వైరా అసెంబ్లీ నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలం లో కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనలో పల్లెల విధ్వంసం, పడకేసిన పారిశుద్ధ్యంపై నిరసన కార్యక్రమ ర్యాలీ లో బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్జెసి కృష్ణ, లకావత్ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి మాజీ ఎంపీ నామ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా నామ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రజలకు లేనిపోని మాయమాటలు, మోసపూరిత హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నామ నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. ​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఎన్నికల ముందు మహిళలకు, యువతకు, విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమం కోసం లక్ష కోట్లు ఖర్చు చేశారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రైతు భీమా పథకాలను అమలు చేయడం లో విఫలమైందని విమర్శించారు కనీసం రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. అన్ని రకాల పెన్షనులు పెంచి అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజులు గడుస్తున్నా ఆ హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఆడబిడ్డలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో పారిశుధ్యం కోసం నాడు కేసీఆర్ హయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని కానీ కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో పల్లెల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైందని తెలియజేశారు.

​కేసీఆర్ పాలన సువర్ణ యుగం

రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం లో తాగు, సాగునీటి కష్టాలు ఉండేవని వాటితో పాటుగా తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేదని మాజీ ఎంపీ నామ గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందాయని ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, 24 గంటలు విద్యుత్, సాగునీరు, తాగునీరు అందించారని అ ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు.

​ఖమ్మం జిల్లా అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందిందని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సైకిళ్లు, మోటార్ సైకిళ్లపై ప్రతి డివిజన్ ప్రతి వీధి తిరిగి ప్రజల సమస్యలు పరిష్కారం చేసిన నాయకుడు అజయ్ కుమార్ అన్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఖమ్మం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారని, ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొంటామని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి పై ముగ్గురు మంత్రులతో చర్చకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి,డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మనీషా లక్ష్మి మదన్ లాల్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.