Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఐఐటీ హైదరాబాద్‌లో అకౌంటెంట్ ఉద్యోగాలు.. రూ.53 వేల వరకు జీతం

Author
Posted By ARYADVI NEWS
| 06 Sep 2026, 07:26 PM | ఉద్యోగావకాశాలు
ఐఐటీ హైదరాబాద్‌లో అకౌంటెంట్ ఉద్యోగాలు.. రూ.53 వేల వరకు జీతం

హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad)లో అకౌంటెంట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు వివరాలు

పోస్టు: అకౌంటెంట్

విద్యార్హత

గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. టాలీ, ERP, MS Office, ముఖ్యంగా Excelపై మంచి అవగాహన అవసరం.

అకౌంటింగ్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ నిర్వహణ, యుటిలైజేషన్ సర్టిఫికెట్ల తయారీ వంటి పనుల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. GST, TDS, ఆదాయపు పన్ను నిబంధనలు, ఆడిట్ ప్రక్రియలపై పరిజ్ఞానం ఉండటం అవసరం.

ఇవి కూడా చదవండి

వయోపరిమితి

అభ్యర్థుల గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 2, 2026
చివరి తేదీ: సెప్టెంబర్ 22, 2026
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఎంపిక విధానం

అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.53 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉంది.

అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఐఐటీ హైదరాబాద్ అధికారిక నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలను పరిశీలించాలి.

అధికారిక వెబ్‌సైట్: www.iith.ac.in