Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

మైనర్ భార్య గర్భం దాలిస్తే భర్తపై పోక్సో కేసు

Author
Posted By ARYADVI NEWS
| 08 Sep 2026, 08:59 AM | NATIONAL
మైనర్ భార్య గర్భం దాలిస్తే భర్తపై పోక్సో కేసు

🔹 18 ఏళ్లలోపు బాలిక గర్భం దాల్చితే భర్తపై పోక్సో కేసు.
🔹 నిందితులకు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం.
🔹 నిందితుల ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేత.
🔹 మైనర్ వివాహాలు జరిపించే పురోహితులు, ఖాజీలుపైనా చర్యలు.
🔹 2016–2026 మధ్య బెంగాల్‌లో 60 వేల మంది మైనర్లు తల్లులైనట్లు వెల్లడి.
🔹 ముర్షిదాబాద్‌లో అత్యధికంగా 12,847 కేసులు నమోదు.
🔹 బాల్య వివాహాల నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్న ప్రభుత్వం.

కోల్‌కతా: బాల్య వివాహాలు, మైనర్ల ప్రసవాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. 18 ఏళ్లలోపు బాలిక గర్భం దాల్చినా లేదా ప్రసవించినా, ఆమె భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి హెచ్చరించారు.ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తుందని, నిందితులకు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నిందితులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని పేర్కొన్నారు.మైనర్ బాలికలకు వివాహాలు జరిపించే పురోహితులు, ఖాజీలు కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.రాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. 2016 జనవరి 1 నుంచి 2026 జూన్ 30 వరకు పశ్చిమ బెంగాల్‌లో సుమారు 60 వేల మంది బాలికలు 18 ఏళ్లు నిండకముందే తల్లులయ్యారు. ఇందులో ముర్షిదాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 12,847 కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు.బాల్య వివాహాలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని సువేందు అధికారి తెలిపారు.