Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పశు ఔషధ బ్యాంకుకు ఔషధ విరాళం:

Author
Posted By ARYADVI NEWS
| 08 Sep 2026, 06:41 PM | TELANGANA
పశు ఔషధ బ్యాంకుకు ఔషధ విరాళం:

చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి దాతృత్వం అభినందనీయం: డా. పి. పెంటయ్య


సూర్యాపేట సెప్టెంబర్ 08:కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంకుకు తొమ్మిదవ విడతగా రూ.5 వేల విలువైన పశు ఔషధాలను నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ జిల్లా సభ్యులు చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి విరాళంగా మంగళవారం అందించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య మాట్లాడుతూ.. గత తొమ్మిది నెలలుగా ప్రతి నెలా రూ.5 వేల విలువైన పశు ఔషధాలను విరాళంగా అందిస్తూ నోరులేని మూగజీవాల ప్రాణ రక్షణకు నిరంతరం కృషి చేస్తున్న చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి దాతృత్వం అభినందనీయమన్నారు. మూగజీవాల పట్ల ఆయన చూపుతున్న సేవాభావం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా సిరిపురపు సురేంద్ర, సిబ్బంది బడేటి శివ, కంపాటి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.