Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

" పోరాటాల నేత సత్తెనపల్లి రామకృష్ణ" "త్యాగం ఎన్నటికీ మరువలేం..

Author
Posted By ARYADVI NEWS
| 08 Sep 2026, 06:58 PM | TELANGANA
" పోరాటాల నేత సత్తెనపల్లి రామకృష్ణ" "త్యాగం ఎన్నటికీ మరువలేం..

- వర్ధంతి సందర్భంగా ఖానాపురం హవేలీలో మెగా రక్తదాన శిబిరం

ఖమ్మం ప్రతినిధి : సెప్టెంబర్, 8:ఖమ్మం:విద్యుత్ ఉద్యమ పోరాటంలో అమరుడైన కామ్రేడ్ సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి సందర్భంగా ఖానాపురం హవేలీలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కామ్రేడ్ సత్తెనపల్లి రామకృష్ణ చిత్రపటానికి సీపీఎం పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ బుగ్గవీటి సరళ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం పార్టీ హవేలి మండల కార్యదర్శి దొంగల తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఎం పార్టీ రాష్ట్ర సెక్రెటరేట్ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మరియు పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల హక్కుల కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, పేదలు–కార్మికులు–రైతుల ప్రయోజనాల కోసం జరిగిన పోరాటాల్లో అనేక మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి అమరుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు.కామ్రేడ్ సత్తెనపల్లి రామకృష్ణ విద్యుత్ రంగంలో ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు జరిగిన పోరాటంలో ప్రాణత్యాగం చేశారని, ఆయన త్యాగం నేటికీ ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు.ప్రస్తుతం దేశంలో ప్రజలపై భారాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ వైపు నడిపించే విధానాలు కొనసాగుతున్నాయని, కార్మికుల హక్కులను పరిమితం చేసే విధానాలు అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కార్పొరేట్ అనుకూల విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు.

విద్యుత్ రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాలను వ్యతిరేకించి, ప్రజలకు అందుబాటులో ఉండే చౌకైన విద్యుత్ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విద్యుత్, విద్య, వైద్యం వంటి మౌలిక రంగాలు ప్రజల హక్కులుగా ఉండాలని, వాటిని వ్యాపార ప్రయోజనాలకు అప్పగించరాదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రక్తదానం ఒక గొప్ప సామాజిక బాధ్యత అని, అత్యవసర పరిస్థితుల్లో ఒకరి రక్తం మరొకరి ప్రాణాలను కాపాడగలదని పేర్కొన్నారు. అమరుడు సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం ద్వారా ఆయన త్యాగాన్ని ప్రజాసేవతో స్మరించుకోవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర సెక్రరీడియట్ సభ్యులు ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్ మరియు సిపిఎం పార్టీ నాయకులు అట్లాగే యూత్ పిల్లలు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వైవిక్రమ్ జిల్లా సెక్రెటరీ సభ్యులు బొంతు రాంబాబు బండి పద్మ జిల్లా కమిటీ సభ్యులు నందిపాటి మనోహర్, ఎంఏ జబ్బర్, ఎస్.కె మీరా సాహెబ్, పిన్నింటి రమ్య,ఎస్ నవీన్ రెడ్డి, భూక్య శ్రీను బండారు రమేష్ పి ఝాన్సీ, వన్ టౌన్ టూ టౌన్ కార్యదర్శులు బోడపట్ల సుదర్శన్ ఎస్కే మీరా సత్తెనపల్లి శ్రీను, రామకృష్ణ సతీమణి కూతురు మంగ రమ్య, డివిజన్ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు యూత్ మహిళలు పాల్గొన్నారు.