Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పోలాల అమావాస్య.. సంతానం కోసం చేసే వ్రతం ఇదే!

Author
Posted By ARYADVI NEWS
| 10 Sep 2026, 09:16 AM | Bhakti
పోలాల అమావాస్య.. సంతానం కోసం చేసే వ్రతం ఇదే!

శ్రావణ అమావాస్యను పలు ప్రాంతాల్లో పోలాల అమావాస్య, సంతాన అమావాస్యగా భావిస్తారు. ఈ రోజున మహిళలు అమ్మవారిని పూజించి, తమ పిల్లల ఆయురారోగ్యాలు, కుటుంబ సౌభాగ్యం కోసం ప్రత్యేక వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. 2026లో ఈ అమావాస్య సెప్టెంబర్ 11న వస్తోంది.
పూజా విధానం
అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి, పూజా మందిరంలో ముగ్గులు వేస్తారు. ఈ వ్రతంలో కంద మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. దానిని పూజా స్థలంలో ఉంచి పసుపు, కుంకుమ, బియ్యపు పిండితో అలంకరిస్తారు.ముందుగా పసుపుతో వినాయకుడిని పూజించి, అనంతరం కంద మొక్కలో మంగళగౌరీ లేదా సంతానలక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసుకుని సంప్రదాయం ప్రకారం పూజ నిర్వహిస్తారు. పసుపు రాసిన ఏడు పోచల దారానికి పసుపుకొమ్ము కట్టి తోరాలను సిద్ధం చేసుకుంటారు.
నైవేద్యాలు ఇవే
ఈ పూజలో నవకాయ కూర, పప్పు తాలికలు, పాల తాలికలు, మినపకుడుములు వంటి ప్రసాదాలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. పూజ అనంతరం ంప్రదాయాన్ని బట్టి బూరెలు, గారెలను కూడా నైవేద్యంగా పెడతారు.పూజ పూర్తయిన తర్వాత వ్రత కథను చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు. ఆచారం ఉన్న కుటుంబాల్లో ముత్తైదువుకు వాయనం ఇచ్చి, పసుపుకొమ్ము కట్టిన తోరాన్ని అందజేస్తారు. అనంతరం మహిళలు, పిల్లలకు కూడా తోరాలు కడతారు.సాయంత్రం అమ్మవారి వద్ద మరోసారి దీపం వెలిగించి పూజ చేస్తారు. ఈ ఆచారాలన్నీ సంతానం క్షేమం, కుటుంబ సౌభాగ్యం కోసం పెద్దల నుంచి కొనసాగుతున్న సంప్రదాయ విశ్వాసాలుగా భావిస్తారు.