Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

మిడ్ వెస్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ అందజేత...

Author
Posted By ARYADVI NEWS
| 11 Sep 2026, 06:34 PM | TELANGANA
మిడ్ వెస్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ అందజేత...

సూర్యాపేట సెప్టెంబర్ 11: మీడ్ వెస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కోదాడ మండలం మంగలి తండా గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ బాక్స్‌ను ఉచితంగా శుక్రవారం అందజేశారు.ఈ కార్యక్రమం మంగలి తండా సర్పంచ్ దరావత్ బాబ్జీ నాయక్ సమక్షంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి అవసరమైన ఫ్రీజర్ బాక్స్‌ను సంస్థ ప్రతినిధులు అందజేశారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మిడ్ వెస్ట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి, సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ అకౌంట్స్ మేనేజర్ శ్రీనివాస్, హచ్ ఆర్ తరుణ్, సైదులు, , గ్రామ కార్యదర్శి వెంకటనారాయణ, ఉప సర్పంచ్ ధరావత్ కృష్ణవేణి హనుమంతు, వార్డు సభ్యులు ధరావత్ కమల కీమా ,ధరావత్ జయ జెoథా, ధరావత్ రాజు, మలావత్ వెంకటేశ్వర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.