బ్రిక్స్ కూటమిలో చేరాలని పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలకు భారత్ వ్యతిరేకత ప్రధాన అడ్డంకిగా మారింది. 2023లో సభ్యత్వం కోసం పాకిస్థాన్ దరఖాస్తు చేసుకోగా, చైనా, రష్యా నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ భారత్ అభ్యంతరంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.బ్రిక్స్‌లో కొత్త సభ్యులను చేర్చాలంటే ప్రస్తుతం ఉన్న సభ్య దేశాలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. దీంతో భారత్ వ్యతిరేకిస్తే పాకిస్థాన్‌కు సభ్యత్వం దక్కే అవకాశం ఉండదు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంతో పాటు అంతర్జాతీయ వేదికపై తన ప్రాధాన్యత పెంచుకునేందుకు పాక్ బ్రిక్స్‌లో చేరాలని ఆసక్తి చూపుతోంది.ఈ నేపథ్యంలో భారత్ తన వైఖరి మార్చుకోనంత కాలం పాకిస్థాన్ బ్రిక్స్‌లో చేరడం కష్టమేనని అంతర్జాతీయ విశ్లేషణలు పేర్కొంటున్నాయి.