Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

అమీనాబాద్ బీసీ కమ్యూనిటీ హాల్ కు స్థలం సేకరణ.....

Author
Posted By ARYADVI NEWS
| 12 Sep 2026, 06:51 PM | TELANGANA
అమీనాబాద్ బీసీ కమ్యూనిటీ హాల్ కు స్థలం సేకరణ.....

8 కుంటల ప్రభుత్వ స్థలాన్ని పంచాయతీ రాజ్ డీఈ కి అప్పగించిన రెవిన్యూ అధికారులు
సూర్యాపేట, సెప్టెంబర్ 12: మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తీర్మానం ఆమోదం పొందింది.తీర్మానం అనంతరం గ్రామంలోని 8 కుంటల ప్రభుత్వ స్థలాన్ని బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు ఆర్ఐ వెంకటనగేష్ హద్దులు కేటాయించి, పంచాయతీ రాజ్ డీఈ సాయిరాం కు అధికారికంగా అప్పగించారు.గ్రామస్తుల సహకారంతో స్థలాన్ని పరిశీలించి హద్దులు నిర్ణయించి అప్పగింత ప్రక్రియ పూర్తి చేశారు.అనంతరం పంచాయతీ రాజ్ డీఈ సాయిరాం మాట్లాడుతూ.. త్వరలోనే ఈ స్థలంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో ఈ హాల్ నిర్మాణం జరగనుందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ...తమ గ్రామానికి బీసీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో గ్రామంలోని బీసీలతో పాటు అన్ని వర్గాల వారికి శుభకార్యాలు, సమావేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేష్, ఉప సర్పంచ్ కవిత, వార్డు సభ్యులు లక్ష్మణ్, లక్ష్మినారాయణ, వెంకటేశ్వర్లు, వెంకన్న, గ్రామస్తులు వీరబాబు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

అమీనాబాద్ బీసీ కమ్యూనిటీ హాల్ కు స్థలం సేకరణ..... - Additional Image