Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణ హత్య

Author
Posted By ARYADVI NEWS
| 15 Sep 2026, 01:44 PM | Array

హైదరాబాద్‌: నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో రౌడీషీటర్‌ మహమ్మద్‌ నహీమ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలు, సెటిల్‌మెంట్లకు సంబంధించిన డబ్బుల వ్యవహారమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన ఉమామహేశ్వర్‌ అలియాస్‌ జేకే మహేష్‌, మహమ్మద్‌ నహీమ్‌ చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా సెటిల్‌మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న నహీమ్‌పై మహేష్‌ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నహీమ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది.
నహీమ్‌, మహేష్‌లపై గతంలోనూ పలు క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు, ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాల ద్వారా పోలీసులు సేకరిస్తున్నారు.
హత్య అనంతరం నిందితుడు మహేష్‌ అతని అనుచరులతో కలిసి పరారైనట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు నాగోల్‌ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.