సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ
సూర్యాపేట, సెప్టెంబర్ 17:తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లింల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. గురువారం నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో అమరవీరుల స్థూపాల వద్ద విప్లవ వీరులకు జోహార్లు తెలియజేస్తూ బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూతెలంగాణ సాయుధ పోరాటం మతాల మధ్య జరిగిన ఘర్షణ కాదని, నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు సాగించిన మహత్తర ప్రజా పోరాటమని స్పష్టం చేశారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన ఈ పోరాటంలో హిందూ, ముస్లిం ప్రజలు కలిసి పాల్గొన్నారని తెలిపారు. నడిగూడెం మండలంలోని సిరిపురం గ్రామంలో నాటి దళాలకి శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఉండేదని దీనిలో తాళ్లూరు జనార్ధనా చారి, వెంపటి రామకోటయ్య, చల్ల రామయ్య ఇంకా అనేక మంది నాయకత్వంలో పెద్ద డెన్ను నిర్వహించే వారిని జనార్ధన చారి ని పట్టుకొని కాల్చి చంపడం జరిగిందని అనేక ఇండ్లు లూటీ జరిగినాయి అని, ప్రజల మీద నిర్బంధం ఉండేదని ఈ సందర్భంగా అనేకమంది అమరులయ్యారని వారన్నారు. సుందరయ్య నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా పేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కమ్యూనిస్టులకే దక్కుతుందని అన్నారు. భూమి కోసం సాగిన పోరాటంలో పేద రైతులు, వ్యవసాయ కార్మికులకు భూమిపై హక్కు కల్పించేందుకుకమ్యూనిస్టులు ముందుండి పోరాడారని పేర్కొన్నారు. ఈ పోరాటం కేవలం రాజకీయ ఉద్యమం మాత్రమే కాదని, భూమి కోసం, సామాజిక విముక్తి కోసం జరిగిన ప్రజా ఉద్యమమని అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టు యోధులు రక్త తర్పణం చేశారని ఆయన తెలిపారు. అనేక మంది నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు ప్రాణాలను త్యాగం చేసి ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణలో సామాజిక, రాజకీయ మార్పులకు పునాది పడిందన్నారు.అదేవిధంగా సాయుధ పోరాటం ద్వారా సుమారు 3,000 గ్రామాలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టు ఉద్యమానిదేనని అన్నారు. దొరలు, భూస్వాముల ఆధిపత్యంలో కొనసాగిన వెట్టిచాకిరీ, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాటం నిర్వహించారని పేర్కొన్నారు. ప్రజల శ్రమకు విలువ ఉండాలని, వెట్టిచాకిరీ నిర్మూలన జరగాలని కమ్యూనిస్టులు ఉద్యమించారని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూతెలంగాణ సాయుధ పోరాట కాలంలో నేటి బీజేపీ రాజకీయ పార్టీగా పుట్టలేదనిఅన్నారు. అయినప్పటికీ నేడు ఆ పోరాట చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పూసి హిందూ–ముస్లింల మధ్య ఘర్షణగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు.నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాడింది కమ్యూనిస్టు పార్టీయేనని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ప్రజలతో కలిసి పోరాడిన కమ్యూనిస్టులే తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులని స్పష్టం చేశారు.చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని, తెలంగాణ సాయుధ పోరాట వాస్తవాలను నేటి తరానికి తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం గ్రామకార్యదర్శి పసుపులేటి వెంకటేశ్వర్లు అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులకు కొరట్ల శ్రీనివాస్, వీరాంజనేయులు, పసుపులేటి నాగమణి, భద్రమ్మ, కొత్తపెళ్లి వెంకన్న, వీరయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు.