Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

మాస్కోపై భారీ డ్రోన్ దాడులు

Author
Posted By ARYADVI NEWS
| 21 Sep 2026, 08:24 AM | INTERNATIONAL
మాస్కోపై భారీ డ్రోన్ దాడులు

రష్యా పార్లమెంట్‌ ఎన్నికల చివరి రోజున ఉక్రెయిన్ మాస్కోపై భారీ డ్రోన్‌, క్షిపణి దాడులు చేసినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో చమురు శుద్ధి కర్మాగారం దెబ్బతినగా, ముగ్గురు పౌరులు మృతి చెందారు.1,100కు పైగా డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. మాస్కోలోని పలు ప్రాంతాల్లో భవనాలు, లాజిస్టిక్స్‌ కేంద్రం దెబ్బతినగా.. నాలుగు విమానాశ్రయాల్లో రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు.రష్యా యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూర్చే చమురు కర్మాగారం, లాజిస్టిక్స్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.మరోవైపు రష్యా కూడా ప్రతీకార దాడులు కొనసాగించింది. కీవ్‌, సుమీ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో చిన్నారులతో సహా పలువురు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.