Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

అంబేద్కర్ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి

Author
Posted By ARYADVI NEWS
| 22 Sep 2026, 06:46 PM | TELANGANA
అంబేద్కర్ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి

సింగరేణి: సెప్టెంబర్, 22: సింగరేణి గ్రామపంచాయతీ లోని అంబేద్కర్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కి మంగళవారం వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఆదేర్ల వినయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ కాలనీలో తేలికపాటి వర్షం పడినా రహదారులు బురదమయం అవుతున్నాయని దీనికి కారణం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమేనని ఇండ్లలో వాడుకుంటున్న మురుగునీరు వెళ్లే దారి లేక చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు మురుగునీరు కలిసి ఇండ్ల బయటికి వచ్చి బురద మయంగా మారుతున్నాయని ఈ సమస్యను పరిష్కరించాలని కారేపల్లి గ్రామపంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. నీరు ఎక్కడికక్కడ ఆగిపోవడం వలన దోమలకు నెలవుగా మారి పర్యావరణం దెబ్బతిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా రని మరియు రహదారిపై నడవడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చూసి వదిలేయడం తప్ప శాశ్వత పరిస్కారం చూపాలని లేనియెడల ప్రజలను కూడగట్టి సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆధర్ల నాగరాజు, సాయి, పిట్టల నాగరాజు తదితరులు పాల్గొన్నారు