Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

వర్షాలకు కొట్టుకుపోయిన ప్రధాన రహదారి......

Author
Posted By ARYADVI NEWS
| 24 Sep 2026, 05:49 PM | TELANGANA
వర్షాలకు కొట్టుకుపోయిన ప్రధాన రహదారి......

పట్టించుకోని అధికారులు..
BMS జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్
చీదేళ్ల–చెట్ల ముకుందాపురం రహదారి ఛిద్రం.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు...
అంబులెన్స్ కూడా వెళ్లలేని దుస్థితి.. ..
రహదారి మరమ్మతులకు డిమాండ్...

సూర్యాపేట, సెప్టెంబర్ 24:పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామం నుంచి చెట్ల ముకుందాపురం వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించడం ప్రజలకు ప్రాణసంకటంగా మారిందని సామాజిక కార్యకర్త, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రహదారి పలుచోట్ల కోతకు గురై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయని, ప్రస్తుతం రోడ్డు మొత్తం బురదమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ రహదారిని చీదేళ్లతో పాటు చెట్ల ముకుందాపురం పరిసర ప్రాంతాల ప్రజలు నిత్యం వినియోగిస్తుంటారని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సైతం ఈ మార్గంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమన్నారు.
ప్రజలు ఎన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టే వరకు కనీసం తాత్కాలికంగా మోరం పోసి గుంతలను పూడ్చి రాకపోకలకు అనుకూలంగా చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా కాలయాపన చేస్తే గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని బీఎంఎస్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ హెచ్చరించారు.

వర్షాలకు కొట్టుకుపోయిన ప్రధాన రహదారి...... - Additional Image